రష్యాతో బంధం పెంచుకుంటాం- ట్రంప్
అమెరికా, రష్యాల మధ్య సంబంధాలు గతంలో ఎన్నడూ లేనంత కనిష్ఠ స్థాయిలో ఉన్నాయి. రెండు దేశాలు కలిసి నడిస్తే అద్భుతంగా ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. శ్వేత సౌధంలో నాటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్బర్గ్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. విదేశీ వ్యవహారాల మంత్రి రెక్స్ టిల్లెర్ సన్ విజయవంతంగా రష్యా పర్యటన ముగించుకొని తిరిగి వచ్చారని తెలిపారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ తదితరులతో భేటీ అయ్యారని, ఫలితాలు ఎలా ఉంటాయో చూడాల్సి ఉందని అన్నారు.






