భారత్, పాక్ మధ్య మధ్యవర్తిగా ట్రంప్
ఇండియా, పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను తగ్గించడానికి అమెరికా తన వంతు పాత్ర పోషిస్తుందని ఆ దేశం సృష్టం చేసింది. రెండు దేశాల మధ్య చర్చల ప్రక్రియ మొదలైతే, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నారని ఐక్యరాజ్యసమితికి అమెరికా రాయబారిగా ఉన్న నిక్కీ హేలీ వెల్లడించారు. ఇండోపాక్ మధ్య ఉద్రిక్తతలపై అమెరికా ప్రభుత్వం కూడా ఆందోళనగానే ఉందని అమె తెలిపారు. గతంలో ఎన్నడూ రెండు దేశాల మధ్య రచ్చల్లో పాల్గొనడానికి అమెరికా ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఉద్రిక్తతలు తగ్గించడంలో తమ వంతు పాత్ర పోషిస్తామని హేలీ సృష్టం చేశారు. ఏదో జరిగే వరకు తాము వేచి చూడాలని అనుకోవడం లేదని అన్నారు.






