TANA: తానా రైతుకోసం… టార్పాలిన్స్ పంపిణీ

తెలుగు ప్రజలకు ఎల్లవేళలా సహాయ సహకారాలు అందించటానికి ముందుండే ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) అధ్యక్షులు నరెన్ కొడాలి మరియు తానా కోశాధికారి రాజా కసుకుర్తి అధ్వర్యంలొ రైతుల కోసం చేపట్టిన ‘రైతు కోసం తానా’ (Rythu Kosam TANA) కార్యక్రమాల్లో భాగంగా టార్పలిన్స్ మరియు పవర్ స్ప్రేయర్స్ అందిస్తోంది. కూళ్ళ గ్రామానికి చెందిన విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ చిట్టూరి వెంకట సూర్యప్రకాశ్ రావు చౌదరి గారు తన 80వ జన్మదిన పురస్కరించుకుని గ్రామంలోని రైతులకు తానా ఆధ్వర్యంలో టార్పాలిన్స్ బహుకరించారు. పంటలు తీసుకొచ్చే సమయంలో వచ్చే వానల వల్ల ఇబ్బందులు పడే రైతులకు ఈ టార్పాలిన్స్ ఎంతగానో ఉపయోగపడతాయని గ్రామస్తులు తెలియజేశారు. తానా చేసే ఇటువంటి సేవా కార్యక్రమాలు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని వారు మరిన్ని ఇలాంటి ప్రయోజన కార్యక్రమాలు చేపట్టాలని ఇక్కడికి విచ్చేసిన వారు ఆకాంక్షించారు. రైతులు తానాకు ధన్యవాదాలు తెలియజేశారు.