మధుమేహ రోగులకు ఓ శుభవార్త
ఆగండాగండి ఈ పదార్ధం తీసుకుంటే ఇప్పుడు మీ రక్తంలో చక్కెర శాతం ఇంతపెరుగుతంది తస్మాత్ జాగ్రత అంటూ ముందుగానే హెచ్చరించే ప్రత్యేక యాప్ను అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు రూపొందించారు. మధుమేహం ఉన్న వారికి ఇది బాహుదా ఉపకరిస్తుందని వారంటున్నారు. ఈ యాప్ పేరు గ్లూకోరాకిల్. ఇందులో సమగ్ర అల్గోరిథమ్ మనం ఏ పదార్థం తింటే రక్తంలో గ్లూకోజు స్థాయిలు ఎంతపెరుగుతాయో ఇట్టే చెప్పేస్తుంది. ఏ ఆహార పదార్థమైనా సరే ఒక్కో వ్యక్తి తీరును బట్టి ఒక్కోరకమైన ఫలితాన్నిస్తుందని కొలంబియా విశ్వవిద్యాలయ వైద్య కేంద్రం శాస్త్రవేత్తలు తెలిపారు. అందుకే, ఈ యాప్ కూడా వ్యక్తుల శారీరక తత్వాన్ని బట్టి, ఆయా ఆహారపదార్థాల ద్వారా వారి రక్తంలో పెరిగే గ్లూకోజు స్థాయులను లెక్కకడుతుంది. వ్యక్తిగతంగా ఈ యాప్ను ఉపయోగించుకునే వారి ఫింగర్స్టిక్ ద్వారా తీసుకున్న రక్తపరిమాణాన్ని తీసుకోబోతున్న ఆహార పదార్థం ఫోటోను గ్లూకోరాకిల్ను అప్లోడ్ చేస్తే చాలు. తీసుకోబోయే ఆహారంలోని పోషకాల విలువను కూడా అంచనాగా వేయాలి సుమా. వివరాలను వెంటనే గ్లూకోరాకిల్ విశ్లేషిస్తుంది. సదరు పదార్ధం తీసుకున్నాక పెరిగే గ్లూకోజ్ శాతాన్ని లెక్కకట్టి హెచ్చరించేస్తుంది.













