డెట్రాయిట్ లో యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ కు సన్మానం
డెట్రాయిట్ యూఎస్ఏ స్థానిక ఐలాండ్ లేక్స్ అఫ్ నోవి సమావేశమందిరంలో తెలుగు సాహితీవేత్తలు, అభిమానులు, తెలుగు సంస్థల నాయకుల సమక్షంలో లయోల కళాశాల పూర్వ విద్యార్థులు డా. యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ ని సన్మానించారు. పద్మభూషణ్ డా. యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ పూర్వ విద్యార్థి, నాట్స్ నాయకులు శ్రీని కొడాలి నిర్వహించిన ఈ కార్యక్రమంలో లక్ష్మి ప్రసాద్ ని ప్రముఖ వైద్యులు, గుంటూరు ఎన్ఆర్ఐ మెడికల్ కళాశాల అధ్యక్షులు డా. ముక్కామల అప్పారావు సత్కరించారు. పురప్రముఖులు కాట్రగడ్డ నరసింహారావు చేతుల మీదుగా లక్ష్మి ప్రసాద్ కి జ్ఞాపికని అందచేశారు.
డా. ముక్కామల అప్పారావు ప్రసంగిస్తూ.. లక్ష్మి ప్రసాద్ తో తనకున్న మూడు దశాబ్దాల పరిచయం, పద్మభూషణుడైన ప్రస్థానాన్ని సభికులకు వివరించారు. నాట్స్ డైరెక్టర్ డా. కొడాలి శ్రీనివాసరావు \లక్ష్మి ప్రసాద్ విజయానికి ఆయన సాధించిన అవార్డులు గీటురాయి అన్నారు. తానా మాజీ అధ్యక్షులు డా. బండ్ల హనుమయ్య చౌదరి హిందీ, తెలుగు బాషలలో లక్ష్మి ప్రసాద్ చేసిన రచనలు వివరిస్తూ వివిధ భాషలపైనా ఆయనకి ఉన్నపట్టుని తెలిపారు. తానా మాజీ బోర్డు అఫ్ డైరెక్టర్ డా. యడ్ల హేమ ప్రసాద్ జై ఆంధ్ర ఉద్యమంలో తాను చూసిన ఒక యువకుడు నేడు పద్మభూషణుడిగా మన ముందు నిలబడటం కృషితో మనిషి సాధించలేనిది ఏమీ లేదు అన్నది మరొకమారు నిరూపితమైనది అన్నారు.
తెలుగులో ఎంతో మంది కవులు, గొప్ప రచయితలు వున్నారు, తనకి దక్కిన ఈ గౌరవం భగవంతుడి వరంలా భావిస్తూ వుంటాను, చివరివరకు తెలుగు భాషకి సేవ చేయాలన్నదే తన అభిమతమని లక్ష్మి ప్రసాద్ తెలిపారు. డా. రాఘవేంద్ర చౌదరి, నాట్స్ నేషనల్ సర్వీసెస్ కోఆర్డినేటర్ కృష్ణ కొత్తపల్లి, డీటీఏ అధ్యక్షులు హర్ష, వేణు సురపరాజు, వినోద్ కుకునూర్ తదితరులు ప్రసంగించారు. డా. సాయి రమేష్ బిక్కిన, డా. సురేష్ అన్నే, డా. సుధ, డా. ఉష , డా. అరుణ బావినేని, డా. సునీల్ కోనేరు, డా. శ్రీదేవి, డా. విజయ, ప్రముఖ నిర్మాత మైత్రి మూవీస్ అధినేత నవీన్ యెర్నేని, ద్వారకా ప్రసాద్ బొప్పన, ప్రసాద్ గొంది, వెంకట్ కొండోజు, సురేష్ పుట్టగుంట, వెంకట్ ఎక్కా, నాని గోనుగుంట్ల, మహీధర్ రెడ్డి, సుధాకర్ కాట్రగడ్డ, శ్రీనివాస్ నిమ్మగడ్డ, సాగర్ మారంరెడ్డి, తానా ఆర్వీపీ శివ యార్లగడ్డ తదితరులు హాజరయ్యారు. కార్యక్రమ వ్యాఖ్యాత గా శివ అడుసుమిల్లి వ్యవహరించారు.













