హైబ్రీడ్ విమానాలు రూపొందిస్తున్న ఐఐటి విద్యార్ధి
ఢిల్లీకి చెందిన మెకానికల్ ఇంజినీరింగ్ పూర్వ విద్యార్థి ఆశిష్ కుమార్ ప్రస్తుతం అమెరికాలో స్థిరపడ్డారు. అమెరికాలోని కిర్క్లాండ్ అనే సంస్థను స్థాపించడమే కాకుండా దానికి సిఇఒగా పనిచేస్తున్నారు. ఆశిష్ అమెరికాలో హైబ్రిడ్ విమానాలను తయారుచేయబోతున్నాడు. ఈ విమానాలను భారతదేశానికి సైతం విక్రయించాలని అనుకుంటున్నాడు. జునుమ్ ఎరో అనే సంస్థ ఆధారంగా ప్రాంతీయ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ విమానాలు రూపొందిస్తున్నాడు. దాదాపు 1,100 కిలోమీటర్ల వరకు ప్రయాణించగల హైబ్రీడ్ విమాలను 2020లోగా, 1,600 కిలోమీటర్ల దూరం ప్రయాణించ గలవాటిని 2030లోగా తయారు చేయనున్నాడు. బోయింగ్ అండ్ జెల్బ్లూ సంస్థలు మమ్మల్ని ప్రోత్సహిస్తున్నాయి. మేం తొలుత 20 సీట్లు ఉండే హైబ్రిడ్ విమానాలతో వస్తాం. ప్రొటోటైప్ విమానాలను మరో రెండేళ్లలో రూపొందిస్తామని నమ్ముతున్నాము. వాణిజ్య విమానాలను 2020 నాటికల్లా నిర్మిస్తాము అని అశిష్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం అతడు మెకానికల్ అండ్ ఎరోస్పేస్ ఇంజినీరింగ్ విభాగంలో కార్నెల్ యూనివర్శిటీలో పిహెచ్డీ చేస్తున్నాడు.






