పేద దేశాలకు రుణ మాఫీ చేయాలి
కరోనా నేపథ్యంలో పేద దేశాల అప్పులను మాఫీ చేయాలని, ప్రపంచ ఆర్థిక మాంద్యాన్ని నివారించడానికి నిధులు కేటాయింపులను పెంచాలంటూ ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్)ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న 300 మంది చట్ట సభల ప్రతినిధులు కోరారు. యూఎస్ మాజీ అధ్యక్ష అభ్యర్థి, సెనెటర్ బెర్నీ శాండర్స్ నేతృత్వంలో ఈ అభ్యర్థన కార్యక్రమాన్ని రూపొందించారు. వైరస్ను నివారించడానికి విధిస్తున్న లాక్డౌన్లతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ భారీగా నష్టపోతోందని, ఈ క్రమంలో ఆరోగ్య, ఆర్థిక సంక్షోభాలను రెండింటినీ ఒకేసారి ఎదుర్కోవాల్సి రావడంతో తక్కువ ఒనరులున్న పేద దేశాలు ఇబ్బందులు పడుతున్నాయని శాండర్స్ అన్నారు. అత్యంత బలహీన దేశాలకు ఉపశమనం కలిగించే తమ ప్రయత్నాకి ఆమెరికా నాయకత్వం వహించాలని సూచించారు.






