75 ఏండ్ల తర్వాత నావికుడి అంత్యక్రియలు
పెరల్హార్బర్పై జపాన్ నిర్వహించిన దాడుల్లో చనిపోయిన అమెరికా నావికుడు మైకెల్ గలాజ్డిక్ అంత్యక్రియలు 75 ఏండ్ల తర్వాత జరిగాయి. ఇలినాయిస్ రాష్ట్రంలోని జూలియట్లో ఆ నావికుడి అవశేషాలను సైనిక లాంఛనాల మధ్య ఆయన ఇంటివద్దే ఖననం చేశారు. అకాశంలో 21 రౌండ్లు తుపాకులు పేల్చి నివాళులర్పించారు. మైలుదూరం సాగిన అంతిమయాత్రలో వందలమంది అమెరికన్లు చేతిలో జాతీయ జెండాలు పట్టుకొని పాల్గొన్నారు. ఎట్టకేలకు గలాజ్డిక్ అంత్యక్రియలు జరిగింనదుకు తనకు భారం దిగిపోయినట్లుందని ఆయన మేనల్లుడు జార్జ్ స్టెర్నిషా తెలిపారు.













