TANA: తానా నాయకత్వ గొడవలు – మరొక్క సారి వచ్చిన కోర్టు ఆర్డర్
దురదృష్ట వశాత్తూ గత రెండు సంవత్సరాలుగా తానా (TANA) ని ఇబ్బంది పెడుతున్న నాయకత్వ సమస్య లో మరొక్క సారి కోర్టు ఆర్డర్ వచ్చింది. మేరీల్యాండ్ కోర్టు శుక్రవారం, 28 మార్చి 2025 తేదీన రాబోయే తానా కాన్ఫరెన్స్ జరపకూడదని కోర్టు కెక్కిన తానా అధ్యక్షుడు శ్రీ నిరంజన్ శృంగవరపు అప్పీల్ ని కొట్టివేసింది. ఈ విషయం లో అప్పీల్ చేసిన నిరంజన్ శృంగవరపు తన వాదన కు సరి అయిన ఆధారాలు చూపించలేకపోయారని అభిప్రాయపడింది.
3-5 జూలై 2025 తేదీలలో డెట్రాయిట్ (Detroit) నగరంలో జరప బోయే 24 వ తానా మహా సభలకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్న కార్యవర్గం ఈ తీర్పుకు హర్షం వెలిబుచ్చింది.
శ్రీ నిరంజన్ అక్టోబర్ 2024 లో కూడా కాన్ఫరెన్స్ కిక్ ఆఫ్ మీటింగ్ ముందు కూడా కోర్టు ను ఆశ్రయించిన విషయం, అప్పుడు కూడా మేరీల్యాండ్ కోర్టు అప్పీల్ ను కొట్టి వేసిన విషయం గుర్తు చేసుకొంటూ, ఇకనైనా కాన్ఫరెన్స్ ఎలాంటి అవరోధాలు కల్పించకుండా నిరంజన్ వర్గం కాన్ఫరెన్స్ నిర్వహణ లో పాలుపంచుకుంటుందని తమ ఆశాభావం వ్యక్తం చేశారు. అదే విధంగా ఇరు వర్గాలు కలిసి పనిచేసి తానా సభలను విజయవంతం చేస్తారని తానా శ్రేయోభిలాషులు, సభ్యులు భావిస్తున్నారు.







