TTA: టీటీఏ చార్లెట్ మెగా కన్వెన్షన్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆహ్వానం
హైదరాబాద్: తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.2026 జులై 17 నుండి 19 వరకు అమెరికాలోని చార్లెట్ నగరంలో జరిగే టీటీఏ మెగా కన్వెన్షన్‌కు హాజరు కావాలని నాయకత్వ బృందం ఆయనకు ఆహ్వాన పత్రికను అందజేసింది.
ఈ ఆహ్వానాన్ని ముఖ్యమంత్రి సానుకూలంగా స్వీకరించి తప్పకుండా వస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కన్వెన్షన్ గొప్పగా విజయవంతం కావాలని కోరుకుంటూ ఆయన తన శుభాకాంక్షలను తెలియజేశారు. ముఖ్యమంత్రి రాక ఖరారు కావడంతో టీటీఏ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
For More Photos Please Click Here






