వీసా ఆరోపణలపై విచారణ జరగాలి
దేశీ ఐటీ దిగ్గజ కంపెనీలు హెచ్1బీ వీసాలను దుర్వినియోగం చేశాయన్న ఆరోపణలపై కాంటిటీషన్ అధారిటీ (సీఏఐ) విచారణ జరపాలంటూ ఐటీ ఉద్యోగుల సమాఖ్య నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ యునెట్స్ (ఎన్సీయూ) డిమాండ్ చేసింది. లాటరీ విధానంలో అదనంగా దరఖాస్తులు పెట్టి అనుచిత రీతిలో హెచ్1బీ వీసాల్లో సింహభాగం దక్కించుకున్నాయన్న అభియోగాలపై దర్యాప్తు చేపట్టాలని ఎన్సీయూ చైర్మన్ జేఎస్ఆర్ ప్రసాద్ పేర్కొన్నారు. ఈ కంపెనీలపై (ఇన్ఫోసిస్, టీసీఎస్) వస్తున్న అభియోగాలపై సీఏఐ విచారణ జరిపి, తప్పు చేశాయా లేదా అన్నది నిర్ధారించాలని ఆయన వ్యాఖ్యానించారు.






