విమానంలో ఎలక్ట్రానిక్ వస్తువులపై బ్రిటన్ నిషేధం
విమానాల్లో మొబైల్ ఫోన్లకంటే పెద్దవైన ఎలక్ట్రానిక్ వస్తువులపై నిషేధం విధిస్తూ బ్రిటన్ నిర్ణయం తీసుకుంది. మధ్యప్రాచ్యానికి చెందిన మొత్తం ఆరు దేశాల నుంచి ఇకపై ల్యాప్టాప్లు, ట్యాబ్లెట్లు వగైరా గ్యాడ్జెట్లను క్యాబిన్ బ్యాగేజ్లో అనుమతించరు. దీంతో టర్కీ, లెబనాన్, జోర్డాన్, ఈజిప్ట్, టునీసియా, సౌదీ అరేబియా దేశాల నుంచి వచ్చే విమాన ప్రయాణికులపై ప్రభావం పడనుంది.






