కోవిడ్ 19పై డా. ప్రసాద్ కిలారుతో బాటా చర్చా కార్యక్రమం

బే ఏరియా తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో కోవిడ్ 19 వైరస్‍పై చర్చాకార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఏప్రిల్ 4వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు ఈ చర్చా కార్యక్రమం జరుగుతుంది. వాషింగ్టన్ హాస్పిటల్ మెడికల్ స్టాఫ్ చీఫ్ డా. ప్రసాద్ కిలారుతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు బాటా నాయకులు తెలిపారు. విరిజల్లు రేడియో (బాలీ 92.3 ఎఫ్‍ఎం)లో ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది.