ATA: ఆటా సమ్మర్ పిక్నిక్ విజయవంతం
మేరీలాండ్, వాషింగ్టన్ డి.సి, ఉత్తర వర్జీనియా ప్రాంతంలోని తెలుగుకుటుంబాల కోసం అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో ఆగస్టు 3, 2025ఆదివారం రోజున డమాస్కస్ రిక్రియేషనల్ పార్క్, మెరిలాండ్ లోని షెల్టర్ వద్ద నిర్వహించిన ఆటా సమ్మర్ పిక్నిక్ (Summer Picnic) అద్భుతంగా, ఉల్లాసంగా జరిగింది. ఈ పిక్నిక్ లో దాదాపు ఆరు వందల మంది పిల్లలు,పెద్దలు,ఇండియా నుండి విజిటింగ్ నిమిత్తం వచ్చిన సీనియర్ సిటిజెన్ లు పాల్గొని రుచికరమైన భోజనాలను ఆస్వాదిస్తూ, ఆటా నిర్వహించిన అనేక క్రీడల్లో, వినోదకార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆటా అధ్యక్షులు జయంత్ చల్లా ఆధ్వర్యంలో, ఆర్ సి లు పార్థ బైరెడ్డి, క్రిష్ణారెడ్ది, జీనత్ రెడ్డి, ట్రస్టీలు శ్రీధర్ భాణాల,విష్ణు మాధవరం, ఆటా పూర్వాధ్యక్షులు భువనేష్ భూజాల, సుధీర్ దామిడి, సతీష్ వడ్డి, రవి చల్లా, వేణు నక్షత్రం, రమేష్ భీంరెడ్డి, అమర్ పాశ్య మరియు ఇతర స్టాండిరగ్ కమిటీ చైర్ లు కో చైర్లు, ఆటా సభ్యులు తదితరుల నిర్వహణలో ఈ పిక్నీక్ విజయవంతంగా జరిగింది.
అధ్యక్షులు జయంత్ చల్లా మాట్లాడుతూ వచ్చే సంవత్సరం అంటే 2026 జూలై 31, ఆగస్ట్ 1,2 తేదీల్లో బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్ లో జరగబోయే ఆటా కన్వెన్షన్ కు అందరూ హాజరై సభలను విజయవంతం చేయాలని కోరారు. అలాగే ఆటా పూర్వఅధ్యక్షులు శ్రీ భువనేశ్ భూజాలా మాట్లాడుతూ మొట్టమొదటి సారి వాషింగ్టన్ డి సి ఏరియా లోని బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్లో జరుగుతున్న ఈ ఆటా సభలని విజయవంతం చేయాలని కోరారు. పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ వినోదాన్ని కలిగించేలా పలు కార్యక్రమాలు నిర్వహించారు.
బింగో, లెమన్ స్పూన్, ఫ్రిస్బీ, తగ్ ఆఫ్ వార్, వాలీబాల్, త్రోబాల్, ఖోఖో లాంటి ఆటలు, మెహందీ డిజైన్స్, మేజీషియన్ ప్రదర్శనలు, సంగీతం, డాన్స్, రాఫిల్ డ్రా ద్వారా బహుమతుల పంపిణీతోపాటు ఫుడ్ డ్రైవ్ ను కూడా నిర్వహించారు. చాలామంది పాల్గొనే వారు నాన్ పెరిషబుల్ ఫుడ్ ఐటమ్స్ తీసుకురావడం ద్వారా మానా ఫుడ్ సెంటర్‌కు గణనీయంగా సహాయమందించారు. ఈ పిక్నిక్ విజయవంతంగా జరుగడానికి తోడ్పడిన ఆర్గనైజర్స్, వాలంటీర్లు, స్పాన్సర్లు మరియు హాజరైన ప్రతి కుటుంబానికి ఆటా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది.
ఈ తరహా సాంస్కృతిక మరియు సామాజిక కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా కొనసాగుతాయని, ప్రతి ఒక్కరూ మరింత ఉత్సాహంగా పాల్గొంటారని ఆశిస్తున్నాం అని నిర్వాహకులు పార్థ బైరెడ్డి అన్నారు.







