భారత సంతతి వైద్యురాలు మృతి
బ్రిటన్‌లో అత్యంత ప్రతిభావంతురాలిగా గుర్తింపు పొందిన, రోగుల మన్ననలు పొందిన భారత సంతతి వైద్యురాలు కరోనాతో పోరాడుతూ తుదిశ్వాస విడిచారు. కేరళకు చెందిన వైద్యురాలు పూర్ణిమా నాయర్ (55) బిషప్ ఆక్లాండ్‌లోని స్టేషన్ వ్యూ మెడికల్ సెంటర్లో పనిచేస్తున్నారు. కొన్నాళ్లుగా కరోనా పోరులో భాగస్వామి అయ్యారు. ఇటీవల అమెకు కరోనా వైరస్ సోకడంతో దవాఖానలో చేర్చారు. కొన్ని రోజులుగా వెంటిలేటర్‌పై ఉండి చికిత్స పొందుతున్న ఆమె బుధశారం తుదిశ్వాస విడిచారు. బ్రిటన్‌లో కరోనాతో మృతి చెందిన పదో వైద్యురాలు ఆమె. మే మెంతో ప్రేమించే మా సహచర ఉద్యోగిని, స్నేహితురాలు పూర్ణిమా నాయర్ మరణవార్త తెలియజేసేందుకు మేమెంతో చింతిస్తున్నాం. ఆమె మరణం మమ్మల్ని తీవ్రంగా కలచివేసింది అని మెడికల్ సెంటర్ ఒక ప్రకటనలో పేర్కొంది. పూర్ణిమ మరణవార్త దిగ్భ్రాంతి కలిగించిందని అక్లాండ్ ఎంపీ డేవిసన్ పేర్కొన్నారు.






