బ్రాడ్ పిట్‌కు షాక్ ఇచ్చిన ఏంజెలినా జోలీ
హాలీవుడ్ స్టార్ హీరో బ్రాడ్ పిట్‌కు స్టార్ హీరోయిన్ ఎంజెలినా జోలీ షాకిచ్చింది. బ్రాడ్ పిట్తో విడాకుల అనంతరం డిప్రెషన్లో కూరుకుపోయిన జోలీ పలు వ్యసనాలకు బానిసైందని, మునుపటి చార్మ్ కోల్పోయిందని పేర్కొంటూ పలు కథనాలు వెలువడ్డ సంగతి తెలిసిందే. తాజాగా ప్రముఖ మేగజీన్ ఒకటి ఎంజెలినా జోలీ మళ్లీ ప్రేమలో పడిందని తెలిపింది. కొత్త ప్రియుడు ఇంగ్లండ్‌కు చెందిన వ్యాపారవేత్త అని వెల్లడించింది. ఎంజెలినా జోలీకి చెందిన మలిబు ఎస్టేట్‌లో వారిద్దరూ తరచు కలుసుకుంటున్నారని ఆ మేగజీన్ తెలిపింది. వారిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని, త్వరలో జోలీ తన పిల్లలకు ఆ వ్యాపారవేత్తను పరిచయం చేయునుందని పేర్కొంది. ఇది తెలిసిన బ్రాడ్ పిట్ షాక్ తిన్నాడని, జోలీ నాలుగో వివాహం చేసుకుంటున్న విషయం తనకు కనీసం చెప్పలేదని ఆవేదన వ్యక్తం చేశాడని తెలుస్తోంది. తన పిల్లలు వేరే వ్యక్తితో ఉంటారన్న ఊహే భరింపశక్యంగా లేదని సన్నిహితుల వద్ద వాపోయినట్టు ఆ కథనం వెల్లడించింది.













