ATA: గ్రామీణ భారతావనికి ‘ఆటా’ స్వచ్ఛ జలనిధి.. ‘కమ్యూనిటీ ప్యూర్ వాటర్’తో కీలక భాగస్వామ్యం
ATA: గ్రామీణ భారతంలో అపరిశుభ్రమైన తాగునీటి వల్ల కలిగే ఆరోగ్య సమస్యలను నిర్మూలించేందుకు అమెరికా తెలుగు సంఘం (ఆటా) నడుం బిగించింది. ‘ప్రొటెక్ట్ హెల్త్.. ఎన్హ్యాన్స్ లెర్నింగ్.. స్టార్ట్ విత్ వాటర్’ అనే నినాదంతో ‘కమ్యూనిటీ ప్యూర్ వాటర్’ (CPW) సంస్థతో కలిసి ఆటా కీలక భాగస్వామ్యాన్ని ప్రకటించింది.
కార్యక్రమ ఉద్దేశ్యం:
భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో శాశ్వత ప్రాతిపదికన స్వచ్ఛమైన తాగునీటిని అందించడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం. దీని ద్వారా,
- 6 రాష్ట్రాల్లోని 600 పైగా సెంటర్ల ద్వారా నీటి శుద్ధి జరుగుతోంది.
- రోజుకు 15 లక్షల మందికి స్వచ్ఛమైన నీరు అందుతోంది.
- దీనివల్ల పిల్లల్లో ఆరోగ్య సమస్యలు తగ్గి, పాఠశాల హాజరు శాతం , విద్యా ఫలితాలు మెరుగుపడతాయి.
ఇవి కూడా చదవండి
లక్ష్యం:
ఈ ‘ఇండియా గివింగ్ డే’ ప్రచారంలో భాగంగా కొత్తగా మరో 100 పాఠశాలల్లో వాటర్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ఆటా లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మహత్కార్యంలో భాగస్వామ్యం కావాలనుకునే వారు ‘ఫ్రెండ్ ఆఫ్ వాటర్’గా మారి విరాళాలు అందించవచ్చు.
ఆటా కార్యవర్గ కమిటీ (Executive Committee):
ఈ సేవా కార్యక్రమానికి మద్దతుగా నిలిచిన ఆటా నాయకత్వం:
- ప్రెసిడెంట్: జయంత్ చల్లా
- ప్రెసిడెంట్ ఎలెక్ట్: సతీష్ రామసహాయం రెడ్డి
- పాస్ట్ ప్రెసిడెంట్: మధు బొమ్మినేని
- సెక్రటరీ: సాయినాథ్ బోయపల్లి
- ట్రెజరర్: శ్రీకాంత్ గుడిపాటి
- జాయింట్ సెక్రటరీ: శారద సింగిరెడ్డి
- జాయింట్ ట్రెజరర్: విజయ్ రెడ్డి తుపాళ్ళి
- ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్: నర్సిరెడ్డి గడ్డికొప్పుల
- ఎగ్జిక్యూటివ్ అడ్వైజర్: అరవింద్ రెడ్డి ముప్పిడి.
ఇవి కూడా చదవండి






