టెక్సాస్ లో తానా నిధుల సేకరణ ఏప్రిల్ 8న
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సెయింట్లూయిస్లో నిర్వహించనున్న మహాసభలను పురస్కరించుకుని వివిధ నగరాల్లో నిర్వహిస్తున్న నిధుల సేకరణలో భాగంగా ఏప్రిల్ 8వ తేదీన టెక్సాస్లోని ఇర్వింగ్లో నిధుల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తానా అధ్యక్షుడు జంపాల చౌదరి, మహాసభల కన్వీనర్ కూర్మనాథ్ చదలవాడ తెలిపారు. అమరావతి ఇండియన్ రెస్టారెంట్లో ఈ కార్యక్రమం జరుగుతుందని తానా అభిమానులు, తెలుగు ప్రముఖులంతా ఈ కార్యక్రమానికి రావాలని వారు కోరారు.






