అమెరికా స్కూల్లో మరో విషాదం
అమెరికాలో మరో విషాదం చోటు చేసుకుంది. కాలిఫోర్నియా రాష్ట్రంలోని ఒక ప్రాథమిక పాఠశాల గదిలో తుపాకీ కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో టీచర్ సహా మరొకరు మృతి చెందారు. మరో ఇద్దరు విద్యార్థులు గాయపడ్డారు. వీరిని ఆసుపత్రికి తరలించారు. ఇది హత్య-ఆత్మహత్య ఘటనగా పోలీసులు అనుమానిస్తున్నారు. శాన్ బెర్నాడినోలోని నార్త్ పార్క్ ప్రాథమిక పాఠశాలలో ఈ ఘటన జరిగింది. కొత్తగా పెళ్లాడిన ఓ జంట, 2015 డిసెంబర్లో ఇదే నగరంలో కాల్పులు జరిపి 14 మందిని బలితీసుకుంది.






