కరోనాతో లింక్ ఉన్న మరో వ్యాధి
అమెరికాలో కరోనా కాస్త తగ్గుముఖం పడుతుందనుకుంటున్న సమయంలో ఇప్పుడు మరో వ్యాధి అక్కడి ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. టాక్సి షాక్ సిండ్రోమ్గా పిలిచే ఈ వ్యాధి కారణంగా ముగ్గురు చిన్నారులు చనిపోగా, మొత్తం న్యూయార్క్ వ్యాప్తంగా వంద మంది పిల్లలకు వ్యాధి సోకింది. అంతేకాకుండా ఇంకొంత మంది పిల్లలో కరోనా సోకిన 6 వారాల తర్వాత టాక్సి షాక్ సిండ్రోమ్ వ్యాధిన పడుతున్నట్లు అధికారులు వెల్లడించారు. పిల్లల్లో జ్వరం, నీరసం, ఆకలి వేయకపోవడం, వికారం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తే వీలైనంత త్వరగా హాస్పిటల్కి తీసుకురావాలని, పరిస్థితి క్షీణిస్తే చనిపోయే ప్రమాదం ఉందని వైద్యులు తెలిపారు. ముఖ్యంగా 5 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడ్డారని, 15 నుంచి 19 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారిలో 16 శాతం కేసులు సంభవిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.






