Zee Telugu దసరా సంబరాలు: కుటుంబానికి దసరావేడుక, సింగిల్స్‌కి సినిమా సందడి!

నిరంతరం వినోదభరితమైన ఫిక్షన్, నాన్ ఫిక్షన్ షోలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న జీ తెలుగు (Zee Telugu) ఈ దసరాకి మరిన్ని ప్రత్యేక కార్యక్రమాలను అందించేందుకు సిద్ధమైంది. ఈ ఆదివారం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్గా సూపర్ హిట్ సినిమా సింగిల్’తోపాటు దసరా ప్రత్యేక కార్యక్రమం ‘దసరా వచ్చిందయ్యా సరదా తెచ్చిందయ్యా’ను ప్రసారం చేయనుంది. శ్రీవిష్ణు, కేతికా శర్మ, ఇవానా నటించిన సింగిల్ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు, గడసరి అత్తలు- సొగసరి కోడళ్ల సందడితో సాగే ‘దసరా వచ్చిందయ్యా సరదా తెచ్చిందయ్యా’ సాయంత్రం 6 గంటలకు, మీ జీ తెలుగులో!
ఈ వీకెండ్‌లో జీ తెలుగు అభిమానులకు మరపురాని అనుభవాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది. డైరెక్టర్ కార్తీక్ రాజు దర్శకత్వంలో, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్ఠాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై రూపొందిన సింగిల్ సినిమాశ్రీవిష్ణు, వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. విజయ్ (శ్రీవిష్ణు) ఓబ్యాంక్‌లో పనిచేస్తుంటాడు. లవర్ లేకుండా సింగల్ గా ఉన్నానని బాధపడుతూ తన ఫ్రెండ్అరవింద్ (వెన్నెలకిషోర్) కి లవర్ ఉండటంతో, వాళ్లెప్పుడు విడిపోతారా అని ఎదురుచూస్తుంటాడు విజయ్. ఈక్రమంలో పూర్వ (కేతికాశర్మ) ని విజయ్ఇష్టపడతాడు. కానీ, పూర్వకి విజయ్అంటే ఇష్టంలేకపోయినా ప్రేమిస్తున్నట్టు నాటకం ఆడుతుంది. మరోవైపు హరిణి (ఇవానా) విజయ్ ను ప్రేమిస్తున్నాని చెప్పి వెంటపడుతూ ఉంటుంది. హరిణి విజయ్ ను ప్రేమిస్తున్నానని ఎందుకు వెంటపడుతుంది?, చివరకు ఏం జరుగుతుంది? అనే విషయాలు తెలియాలంటే ఈ ఆదివారం జీ తెలుగులో ప్రసారమయ్యే సింగిల్ సినిమా చూడాల్సిందే!
ఇక దేవీ నవరాత్రుల సందర్భంగా జీ తెలుగు అందిస్తున్న ‘దసరా వచ్చిందయ్యా సరదా తెచ్చిందయ్యా’ కార్యక్రమం నటీనటుల ఆటపాటలు, అల్లరితో ప్రేక్షకులను అలరించనుంది. ఈ కార్యక్రమానికి ఎనర్జిటిక్ యాంకర్ ప్రదీప్ మాచిరాజువ్యాఖ్యాతగా వ్యవహరించనుండగా ప్రముఖ నటి రోజా, యాంకర్ అనసూయ అత్తాకోడళ్ల టీమ్ లుగా విడిపోయి గడసరి అత్తలు – సొగసరి కోడళ్లుగా పోటీపడనున్నారు. అత్తల టీమ్ కి రోజా, కోడళ్ల టీమ్ కి అనసూయ నాయకత్వం వహించనుండగా పల్లవి గౌడ, అశికా పదుకొణె, భూమిక, మహీ గౌతమి, సుస్మిత, జయశ్రీ తదితరులు రెండు టీముల్లో చేరి పోటీపడనున్నారు. అద్భుతమైన ప్రదర్శనలు, అలరించే పంచులు, కడుపుబ్బా నవ్వించే కామెడీతో సరదాగా సాగిన ఈ దసరా వేడుకను మీరూ తప్పకుండా చూసేయండి!
జీ తెలుగు వీకెండ్ హంగామా.. సింగిల్ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్, దసరా వచ్చిందయ్యా సరదా తెచ్చిందయ్యా.. డోంట్ మిస్!