Samantha: సమంత పెట్టుకున్న వాచ్ ధరెంతో తెలుసా?

ఏ మాయ చేసావె సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన సమంత (Samantha) తక్కువ కాలంలోనే సౌత్ లో స్టార్ హీరోయిన్ గా మారింది. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే నాగచైతన్యను పెళ్ళి చేసుకుని తర్వాత నాలుగేళ్లకే విడాకులు తీసుకుంది. అప్పట్నుంచి ఏదొక విషయంలో వార్తల్లో నిలుస్తున్న సమంత, మయోసైటిస్ వ్యాధి వల్ల ఎన్నో ఇబ్బందులు పడింది. సమస్యలన్నింటి నుంచి కోలుకుని మళ్లీ ఇప్పుడు ఇండస్ట్రీలో బిజీ అయ్యే ప్రయత్నం చేస్తున్న సమంత సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటుంది.
ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ ను షేర్ చేసే సామ్, తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేయగా, అందులో సమంత ధరించిన వాచ్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దీంతో అందరూ సమంత పెట్టుకున్న వాచ్ గురించి తెగ వెతుకుతున్నారు. సామ్ పెట్టుకున్న వాచ్ ట్రాపేజ్డ్ షేప్ ఉండే పియాజెట్60 జువెలరీ వాచ్. రేటు సుమారు రూ.30 లక్షలకు పైగా ఉంటుంది. ఇలాంటి కాస్ట్లీ వాచ్‌లు పెట్టుకోవడం సమంతకు కొత్త కాకపోయినా ఆ వాచ్ అమ్మడి చేతికి మరింత అందాన్ని తెచ్చిందని నెటిజన్లు భావిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి బ్రాండెడ్ వాచ్‌లు సమంత దగ్గర చాలానే ఉన్నాయని చెప్పొచ్చు. ఇక సమంత పర్సనల్ విషయానికొస్తే, చైతన్యతో విడిపోయాక సామ్, డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో రిలేషన్‌లో ఉందని వార్తలొస్తున్నాయి. వారిద్దరూ కలిసి ఇప్పటికే చాలా సార్లు బహిరంగంగా కనిపించారు.