Pawan Kalyan: ఇటు బాలయ్య సెటైర్.. అటు చిరంజీవి క్లారిటీ.. మధ్యలో పవన్ కళ్యాణ్..

జనసేన (Janasena) అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇప్పుడు రాజకీయంగా ఇరుకున పడ్డట్టే అనిపిస్తోంది. గురువారం అసెంబ్లీ (Assembly) వేదికపై రాష్ట్రంలోని సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం జరిగిన చర్చలో కొన్ని అనూహ్య పరిణామాలు ఏర్పడ్డాయి. బీజేపీ (BJP) ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ (Kamineni Srinivas) చేసిన వ్యాఖ్యలు, వాటికి నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఇచ్చిన వ్యంగ్య స్పందనలు రాజకీయంగా పెద్ద చర్చను రేకెత్తించాయి.
గతంలో పవన్ తరచూ విమర్శించిన విషయమే ఈ చర్చకు హబ్ అయింది. ముఖ్యమంత్రి జగన్ మోహనరెడ్డి (Jagan Mohan Reddy) సినీ ప్రముఖులను సరైన గౌరవం ఇవ్వలేదని, వారిపై అవమానం జరిగిందని పవన్ అనేక సందర్భాల్లో అన్నారు. కానీ బాలకృష్ణ వ్యాఖ్యల తర్వాత ఈ విషయం కొత్త మలుపు తీసుకుంది. అసెంబ్లీ వేదికపై బాలకృష్ణ చిరంజీవికి (Chiranjeevi) అవమానం జరిగిందని గుర్తుచేశారు, కానీ అక్కడ ఎవరూ స్పష్టంగా మాట్లాడలేదని వ్యంగ్యంగా చెప్పారు.
కామినేని శ్రీనివాస్ కూడా ఈ అంశాన్ని మరోసారి ప్రస్తావించారు. చిరంజీవి వంటి సినీ ప్రముఖులను ప్రధాన మంత్రి ప్రత్యక్షంగా కలవనివ్వక, సినీ ఆటోగ్రాఫ్ మంత్రితో మాత్రమే కలవాలని పేర్కొన్నట్లు గుర్తుచేశారు. ఈ పరిణామాలు కొంతమంది రాజకీయ వర్గాల్లో కలవరాన్ని సృష్టించాయి. ఇక చిరంజీవి తాజాగా 2020 ఆగస్టులో తాడేపల్లి (Tadepalli) లో జరిగిన మీటింగ్ వివరాలను అందించారు. ఆ సమయంలో ఆయనకు ఎక్కడా అవమానం జరగలేదని, జగన్ సాదరంగా కలిసినట్లు, ముందుగా ఇంటికి పిలిచి అన్ని అంశాలను చర్చించిన తరువాత 10 మంది సినీ ప్రముఖులను కలిశారని వివరించారు. అంతేకాదు చెప్పినట్లే సినిమా రంగంలో ఉన్న సమస్యలను పరిష్కరించారని, టికెట్ రేట్ల పెంపు కూడా సరిచేశారని తెలిపారు.
ఇప్పుడు ఈ క్లారిటీ వెలువడిన తర్వాత పవన్ తన అన్న చిరంజీవి గౌరవానికి సంబంధించి ఇరుకునపడ్డట్టే అనిపిస్తోంది. ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా తన అన్న అవమానం జరిగింది అని పవన్ ఎన్నో సందర్భాల్లో పేర్కొన్నారు. దీనికి సంబంధించి సోషల్ మీడియా వేదికగా ఎన్నో వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు చిరంజీవి ఇచ్చిన ఎక్స్ప్లనేషన్ దీనికి పూర్తి భిన్నంగా ఉండడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అయితే ఇక్కడ అందరి దృష్టిని ఆకర్షిస్తున్న మరో ట్విస్ట్ ఇప్పుడు పవన్ ఏం చేస్తారో అన్న విషయం. ఎందుకంటే ఈ విషయంలో పవన్ తన అన్నని సపోర్ట్ చేస్తే ఈ ఐదు సంవత్సరాలు చెప్పింది అబద్ధం అని ఒప్పుకున్నట్లే.. కాదు అని బాలయన సపోర్ట్ చేస్తే తన అన్న అబద్ధం చెప్పినట్లు ఒప్పుకున్నట్లు అవుతుంది. మరి ఇప్పుడు పవన్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి..