Harjit Kaur: 33 ఏళ్లుగా అమెరికాలో.. అయినా స్వదేశానికి గెంటివేత

అమెరికాలో 33 ఏళ్లుగా అక్రమంగా ఉంటున్న సిక్కు మహిళ హర్జిత్ కౌర్ (Harjit Kaur) ను డిపోర్టు చేశారు. 73 ఏళ్ల ఆ సిక్కు మహిళ పేరు హర్జిత్ కౌర్. కాలిఫోర్నియా (California)లోని ఇమ్మిగ్రేషన్ అధికారులు కొన్ని రోజుల క్రితం ఆమెను నిర్బంధించారు. బలవంతంగా ఆమెను ఇటీవల ఢిల్లీ (Delhi) కి పంపారు. ఆశ్రయం కల్పించాలని చాన్నాళ్ల క్రితమే ఆమె అభ్యర్థన పెట్టుకున్నది. కానీ అమెరికా ఆ అభ్యర్థనను తిరస్కరించింది. కనీసం తమ బంధువులకు గుడ్‌బై చెప్పే అవకాశం కూడా ఇవ్వలేదని ఆమె తరపున అడ్వకేట్ తెలిపారు.
అమెరికాలో సరైన రీతిలో జీవించానని, పని చేశానని, పన్నులు చెల్లించాలని, అయినా తనను క్రూరంగా గెంటివేశారని ఆమె ఆరోపించారు. శాన్‌ఫ్రాన్సిస్‌కో, బే ఏరియా (Bay Area) లో జీవించింది. అక్కడ బెర్కిలేలోని ఓ బట్టల దుకాణంలో పనిచేసింది. మోకాలి సర్జరీల వల్ల ఆమె ఉద్యోగం ఇటీవల మానేసింది. సెప్టెంబర్ 8వ తేదీన రోటిన్‌గా జరిగిన ఇమ్మిగ్రేషన్ చెకింగ్ సమయంలో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆశ్రయం కల్పించాలని కోరుతూ 2012లో ఆమె చివరిసారి దరఖాస్తు చేసుకున్నది. కానీ ఆ దరఖాస్తును ఇమ్మిగ్రేషన్ శాఖ తిరస్కరించింది. జార్జియా, అర్మేనియా మీదుగా మరికొంత మందితో ఆ సిక్కు మహిళను ఢిల్లీకి తీసుకువచ్చారు.