Donald Trump: ఇజ్రాయెల్‌ను అనుమతించను : ట్రంప్

వెస్ట్‌బ్యాంక్ పై దూకుడును అనుమతించనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) పేర్కొన్నారు. ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. వెస్ట్‌బ్యాంక్ ఆక్రమణకు ఇజ్రాయెల్ (Israel) ను నేను అనుమతించను. ఇప్పటివరకు చేసింది చాలు . ఇక ఆపాల్సిన సమయం ఆసన్నమైంది అని వ్యాఖ్యానించారు. వెస్ట్‌బ్యాంక్ (West Bank) అంశంపై ట్రంప్ ఇటీవల కాలంలో తొలిసారి చేసిన వ్యాఖ్యలు ఇవి. ఇటీవల గాజా (Gaza) ను ఇజ్రాయెల్ ఆక్రమించుకోవడంపై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు న్యూయార్క్‌లో ఆ దేశ ప్రధాని నెతన్యాహు పర్యటనకు రంగం సిద్ధమైన వేళ ట్రంప్ వ్యాఖ్యలు వెలువడటం గమనార్హం.