Zee Telugu: బాలగాయకులకు సువర్ణావకాశం.. జీ తెలుగు సరిగమప సీజన్ 17 ఆడిషన్స్..
తెలుగు ప్రేక్షకులకు ఎనలేని వినోదాన్ని పంచడంలో ముందుండే ఛానల్ జీ తెలుగు(Zee Telugu). ఫిక్షన్, నాన్-ఫిక్షన్ షోలతో పాటు ప్రత్యేక కార్యక్రమాలతో వినోదం అందిస్తూనే ప్రతిభావంతులను వెలికితీయడంలోనూ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. జీ తెలుగు సరిగమప (Sa Re Ga Ma Pa) కార్యక్రమం ద్వారా ఎంతోమంది గాయనీగాయకులను ప్రేక్షకులకు పరిచయం చేసింది. విజయవంతంగా 16 సీజన్లు పూర్తి చేసుకున్న జీ తెలుగు సరిగమప, 17వ సీజన్ ‘సరిగమప లిటిల్ ఛాంప్స్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ‘సరిగమప సీజన్ 17’ను ఘనంగా ప్రారంభించేదుకు తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా ఆడిషన్స్ నిర్వహిస్తూ బాల గాయనీగాయకులు తమ ప్రతిభను నిరూపించుకునేందుకు జీ తెలుగు సువర్ణావకాశాన్ని అందిస్తోంది.
జీ తెలుగు సరిగమప తదుపరి సీజన్ కోసం తెలుగు రాష్ట్రాల్లోని పలు పట్టణాల్లో ఆడిషన్స్ నిర్వహిస్తోంది. ప్రతిభను ప్రోత్సహిస్తూ మట్టిలోని మాణిక్యాలను వెలికితీసేందుకు ఈ ఆదివారం మన హైదరాబాద్‌లో ఆడిషన్స్ నిర్వహిస్తోంది. సరిగమప సీజన్ 17 ఆడిషన్స్ హైదరాబాద్ లోని అమీర్‌పేట్, శ్రీసారథి స్టూడియోస్ నందు ఆగస్టు 3, ఆదివారం రోజున ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతాయి. 4-14 సంవత్సరాల వయస్సుగల పిల్లలు ఈ ఆడిషన్స్ లో పాల్గొనవచ్చు. ఆసక్తి గలవారు జీ తెలుగు అందిస్తున్న ఈ గోల్డెన్ ఛాన్స్‌ని మిస్ కావద్దు! వివరాల కోసం 9154145100 నెంబర్ సంప్రదించవచ్చు. ఇంకెందుకు ఆలస్యం జీ తెలుగు సరిగమప ఆడిషన్స్ లో పాల్గొని సీజన్ 17 టైటిల్ పోటీలో మీరూ చేరిపోండి!
మీ పిల్లల్లోని ప్రతిభను ప్రోత్సహించేందుకు చక్కని వేదిక జీ తెలుగు సరిగమప సీజన్ 17.. ఆడిషన్స్ లో పాల్గొనండి!







