Vijay Devarakonda: సుకుమార్ సినిమాపై విజయ్ ఏమన్నాడంటే
చిన్న పాత్రలు చేస్తూ ఇండస్ట్రీకి పరిచయమైన విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) ఆ తర్వాత పెళ్ళి చూపులు(pelli choopulu) సినిమాతో హీరోగా మారి మొదటి సినిమాతోనే హీరోగా మెప్పించాడు. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా(sandeep reddy vanga) దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి(arjun reddy) సినిమాలో హీరోగా నటించి ఆ సినిమాతో తన కెరీర్ నే మార్చేసుకున్నాడు. అర్జున్ రెడ్డి మూవీ తర్వాత విజయ్ రేంజ్ పూర్తిగా మారిపోయింది.
కానీ గత కొన్ని సినిమాలుగా విజయ్ కు సరైన హిట్ రావడం లేదు. అయితే రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన కింగ్డమ్(Kingdom) సినిమాతో విజయ్ మంచి హిట్ అందుకున్నాడు. ఆ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటూ విజయ్ తన తర్వాతి సినిమాల గురించి మాట్లాడాడు. రవికిరణ్ కోలా(ravikiran kola)తో ఓ సినిమా, రాహుల్ సాంకృత్యన్(rahul sankrithyan) తో ఓ సినిమా చేస్తున్నానని విజయ్ చెప్పాడు.
ఇదే సందర్భంగా సుకుమార్(sukumar) తో మూవీపై కూడా విజయ్ రియాక్ట్ అయ్యాడు. అర్జున్ రెడ్డి సినిమా నుంచే సుకుమార్, తాను కలిసి ఓ సినిమా చేయాలనుకున్నామని చెప్పిన విజయ్, సుకుమార్ కు తన వర్క్ అంటే ఇష్టమని, ఫ్యూచర్ లో ఇద్దరూ కలిసి వర్క్ చేస్తామని చెప్పాడు. ప్రస్తుతానికైతే తన దృష్టంతా చేస్తున్న సినిమాలపైనే ఉందని విజయ్ తెలిపాడు.







