విశ్వనాథ్‌కు వెంకయ్య అభినందలు
ప్రముఖ సినీ దర్శకుడు కె.విశ్వనాథ్‌కి కేంద్ర ప్రభుత్వం దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఆయన్ని కలిసి అభినందనలు తెలిపారు. ఫిలింనగర్‌లోని విశ్వనాథ్ ఇంటికి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, జి.కిషన్‌రెడ్డి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేశారు. విశ్వనాథ్‌కు శాలువా కప్పి పుష్పగుచ్చాలు అందజేశారు.






