తెలంగాణ ఫిలించాంబర్ ప్రమాణస్వీకారం
తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి, నిర్మాతలు, వివిధ శాఖలకు సంబంధించిన కార్మికుల సంక్షేమానికి, అలాగే సమస్యల పరిష్కారానికి తెలంగాణ ఫిలించాంబర్ ఆఫ్ కామర్స్ కృషి చేస్తోందని అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్ వెల్లడించారు. తెలంగాణ ఫిలంచాంబర్ మూడవ వార్షికోత్సవం జరుపుకోవడంతోపాటు నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. అధ్యక్షుడిగా ప్రతాని రామకృష్ణగౌడ్, ఉపాధ్యక్షుడిగా జె.వి.ఆర్. కార్యదర్శిగా సాయివెంకట్, 23 మంది కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు. తెలంగాణ మూవీ అండ్ టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా సీనియర్ నటి కవిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం ప్రసాద్ ల్యాబ్లో ప్రమాణస్వీకార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నటుడు నర్సింగారాజు, సీనియర్ నటి గీతాంజలి, మిస్ ఆసియ రేష్మి ఠాకూర్, కిషన్, కట్ట రాంబాబు, బులెట్ రవి తోపాటు అధిక సంఖ్యలో సినీ కార్మికులు పాల్గొని విజయవంతం చేసారు.













