Tejaswini: ఆయన వల్లే దిల్ రాజు తో నా పెళ్లి జరిగింది

నిర్మాత దిల్ రాజు(Dil Raju) మొదటి భార్య చనిపోయాక తేజస్విని(Tejaswini)2ని రెండో పెళ్లి చేసుకోగా, ఆ టైమ్ లో వారి పెళ్లిపై చాలానే చర్చలు జరిగాయి. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తేజస్విని తమ ప్రేమ, పెళ్లి గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. తమ పెళ్లి అంత సులభంగా జరగలేదని, దాని కోసం చాలానే ఇబ్బందులు పడాల్సి వచ్చింది తేజస్విని తెలిపింది.
మొదట్లో ఆయన ఎవరో కూడా తెలియదని, ఆయన గురించి తెలియనప్పుడు ఆయనొక డైరెక్టర్ అనుకున్నానని, కానీ తర్వాత గూగుల్ లో చూసి నిర్మాత అని తెలుసుకున్నానని, ముందు ఆయనకు ఫ్యామిలీ ఉందని తెలిసి బ్యాక్ స్టెప్ వేశా, కానీ ఆ తర్వాత విధే తమని కలిపిందని, తమ విషయాన్ని ఇంట్లో చెప్పాలనుకున్నప్పుడు ముందుగా ఎవరిని కన్విన్స్ చేయాలని రాజు గారు తనను అడిగినట్టు తేజస్వినీ తెలిపింది.
అప్పుడు తన పెద్ద మామ గురించి చెప్పానని, తమ ఫ్యామిలీలో పెద్ద మామ హిట్లర్ లాంటి వారని, ఆయన చాలా స్ట్రిక్ట్ అని, ఆయన్ని ఒప్పిస్తే మిగిలిన వారిని ఈజీగా ఒప్పించొచ్చు అనుకున్నామని, ఆ తర్వాత పిన్నికి చెప్పానని, తన పిన్ని ఒప్పుకోలేదని, ఆ తర్వాత పెద్ద మామే తమను అర్థం చేసుకుని అందరినీ ఒప్పించారని, ఇవాళ తాను ఈ పొజిషన్ లో ఉండటానికి కారణం ఆయనేనని తేజస్విని తెలిపింది. దేవుడు తాను కోరుకున్నవన్నీ ఇచ్చాడని, ఇంకా చెప్పాలంటే కోరుకున్న దాని కంటే ఎక్కువే ఇచ్చాడని ఈ సందర్భంగా తేజస్విని చెప్పింది.