Teja Sajja: తేజ ఇకనైనా స్పీడు పెంచాలి

చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ ను మొదలుపెట్టిన తేజ సజ్జా(teja sajja) వరుస సక్సెస్ లతో లైఫ్ లో చాలా ఆనందంగా ఉన్నాడు. రీసెంట్ గా మిరాయ్(mirai) సినిమాతో సూపర్ హిట్ ను అందుకున్న తేజ, దాని కంటే ముందు హను మాన్(hanu man) సినిమాతో సక్సెస్ అందుకోవడంతో పాటూ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ గుర్తింపును కాపాడుకోవాలనే మిరాయ్ కాస్త లేటైనా ఓపిగ్గా ఎదురుచూశాడు.
మిరాయ్ తో సక్సెస్ అందుకున్న తేజ తన నెక్ట్స్ మూవీగా జాంబిరెడ్డి2ను చేయనున్నాడని సమాచారం. మిరాయ్ ను నిర్మించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ(people media factory) బ్యానర్ లోనే ఈ సినిమా కూడా రూపొందనుంది. జాంబిరెడ్డి2(jombie reddy2)కు ప్రశాంత్ వర్మ(prasanth varma) కథ అందించనున్నాడు. డైరెక్టర్ గా రానా నాయుడు(rana naidu) డైరెక్టర్ సుపర్ణ్ వర్మ(suparn varma) బాధ్యతలు తీసుకునే అవకాశముందని తెలుస్తోంది.
జాంబిరెడ్డి2 సినిమాను 2027 సంక్రాంతికి రిలీజ్ చేస్తామంటున్నారు. అంటే మరో ఏడాదిన్నర ఉంది. వాస్తవానికి కాస్త లేటైనా సరే ఆడియన్స్ ను మెప్పించాలని తేజ చేస్తున్న ప్రయత్నం బాగానే ఉన్నప్పటికీ తేజ ఇదే స్పీడుతో సినిమాలు చేస్తే అతని ప్రైమ్ టైమ్ మొత్తం వేస్ట్ అవుతుందని అందరూ అభిప్రాయపడుతున్నారు. కాబట్టి ఇకనైనా తేజ స్పీడును పెంచి సినిమాలు చేస్తే బావుంటుందనేది అందరి కోరిక.