ముత్యాల మధ్య మెరిసిపోతున్న మిల్కీ బ్యూటీ
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా(Tamannaah Bhatia) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న తమన్నా ఓ వైపు హీరోయిన్ గా నటిస్తూనే మరోవైపు స్పెషల్ సాంగ్స్ చేస్తూ పాన్ ఇండియా లెవెల్లో మంచి క్రేజ్ ను అందుకుంది. తన ఫ్యాషన్ ఎంపికలతో అందరినీ ఆకట్టుకునే మిల్కీ బ్యూటీ తాజాగా ఐవరీ పర్ల్ కేప్ డ్రెస్ లో ఎంతో హుందాగా మెరిసింది. ఈ ఫోటోల్లో ముత్యాల మధ్య తమన్నా అందాలను చూస్తే నెటిజన్లకు మతులు పోతున్నాయి. సింపుల్ మేకప్, లూజ్ హెయిర్ స్టైల్ ఆమె అందాన్ని మరింత ఎలివేట్ చేస్తుండగా, ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.






