Sree Vishnu: సింగిల్ మొదటి హీరో అతను కాదా?

కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ ప్రతీ సినిమాతో ఆడియన్స్ ను అలరిస్తూ వస్తున్నాడు టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు(Sree Vishnu). అతను హీరోగా కార్తీక్ రాజ్(Karthik Raju) దర్శకత్వంలో చేసిన తాజా సినిమా సింగిల్(Single). మే 9న రిలీజ్ అయిన ఈ సినిమా ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుని శ్రీవిష్ణు ఖాతాలో మరో హిట్టు పడేలా చేసింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ ఈవెంట్ లో శ్రీవిష్ణు ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయటపెట్టాడు.
ఇప్పుడు ఆడియన్స్ థియేటర్లో చూసి ఎంతో ఎంజాయ్ చేస్తున్న ఈ సినిమా కథ ముందు శ్రీవిష్ణు దగ్గరకు కాదట వెళ్లింది. డైరెక్టర్ కార్తీక్ రాజు ఈ సినిమా కథను ఎంతోమందికి చెప్పాడట. కానీ వాళ్లందరూ ఆ కథను రిజెక్ట్ చేయడంతో అది ఆఖరికి శ్రీవిష్ణు దగ్గరకు వెళ్లిందట. అలా శ్రీవిష్ణు దగ్గరకు వెళ్లిన కథను అతను మొదట్నుంచి నమ్మి ఆ సినిమాకు ఓకే చెప్పాడట.
ఈ విషయాన్ని స్వయంగా శ్రీవిష్ణునే చెప్పాడు. అదే సందర్భంగా సింగిల్ సినిమా కథను రిజెక్ట్ చేసిన వారికి కూడా శ్రీవిష్ణు థ్యాంక్స్ చెప్పాడు. దానికి కారణం వాళ్లు రిజెక్ట్ చేయబట్టే ఆ కథ తన దగ్గరకొచ్చి తనకు హిట్ అందేలా చేసిందని. మొత్తానికి శ్రీవిష్ణు ఆడియన్స్ పల్స్ ను సరిగ్గా పట్టుకుని వారికి నచ్చే కథలే చేస్తూ భలే ఎంటర్టైన్ చేస్తున్నాడు. సింగిల్ సినిమా తర్వాత మరో రెండు సినిమాలను గీతా ఆర్ట్స్(Geetha Arts) లోనే చేయడానికి అల్లు అరవింద్(Allu Aravind) శ్రీవిష్ణుతో డీల్ కూడా కుదుర్చుకుని ఆల్రెడీ చెక్ కూడా ఇచ్చారు.