Satyadev: నో చెప్పడంలో ఫెయిల్యూర్ని
టాలీవుడ్ టాలెంటెడ్ నటుడు సత్యదేవ్(Satyadev) యాక్టర్ గా ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. నటుడిగా ఎంత మంచి పేరు తెచ్చుకున్నా తాను ఓ విషయంలో మాత్రం ఫెయిల్యూర్నే అంటున్నాడు. రీసెంట్ గా విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) హీరోగా వచ్చిన కింగ్డమ్ సినిమాలో కీలక పాత్రలో నటించిన సత్యదేవ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించాడు.
ఎదుటివారికి నో చెప్పడంలో తాను ఫెయ్యూలర్ను అని, వారు ఇబ్బంది, బాధ పడకుండా నో ఎలా చెప్పాలా అని చాలా కష్టపడతానని చెప్పాడు సత్యదేవ్. కింగ్డమ్(kingodm) సినిమాలోని శివ పాత్రను తనను దృష్టిలో ఉంచుకునే రాసుకున్నప్పటికీ, వేరే వారితో చేద్దామనుకున్నారని కానీ ఆఖరికి ఆ పాత్ర తన వద్దకే వచ్చిందని, ఏ పాత్ర ఎవరు చేయాలనేది ముందే డిసైడ్ ఉంటుందేమోనని అప్పుడే అనిపించిందని సత్యదేవ్ చెప్పాడు.
తాను సినిమాలు చేస్తుంది డబ్బు కోసం మాత్రమే కాదని, డబ్బే ప్రాధాన్యత అయితే వెళ్లి పొలం పని చేసుకుంటా కానీ సినిమాలు చేయనని అన్నాడు సత్యదేవ్. కింగ్డమ్ మూవీలో రెండు సన్నివేశాలు తనకు చాలా సవాలుగా అనిపించాయని, వాటి కోసం ఎంతో కష్టపడ్డానని కానీ సినిమా రిలీజై ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చాక ఆ కష్టమంతా మర్చిపోయానని సత్యదేవ్ చెప్పాడు.







