Satyadev: నీ సినిమాలు ఆడవు కదా అన్నారు
టాలీవుడ్ లో మంచి నటుడిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సత్యదేవ్(satyadev). ఆయన ఏ పాత్రలో నటించినా ఆ పాత్రకు 100% న్యాయం చేయగలడు. ఇంకా చెప్పాలంటే టాలీవుడ్ లో సత్యదేవ్ లాంటి మరో నటుడే లేడు. సత్యదేవ్ తన కెరీర్లో చేసిన క్యారెక్టర్లు మరో నటుడైతే కచ్ఛితంగా చేయలేడు. రీసెంట్ గా కింగ్డమ్(kingdom) సినిమాలో కనిపించి ఆకట్టుకున్న సత్యదేవ్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యలో పాల్గొని ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని వెల్లడించాడు.
పెద్ద నిర్మాత ఒకరు ఓ సందర్భంలో తనను కలిసి తన సినిమాలో విలన్ గా నటించమని అడిగారని, దానికి తాను నో చెప్పడంతో ఆయన ఎందుకని అడిగారని, హీరోగా చేయాలనుకుంటున్నా అని చెప్పడంతో ఎందుకు విలన్ గా చేసుకోవచ్చు కదా, విలన్ అయితే పెద్ద హీరోలంతా నిన్ను కనీసం మూడు నాలుగు సినిమాల్లో పెట్టుకుంటారని, ఎలాగూ నీ సినిమాలు ఆడవు కదా అని ముఖం మీదే చెప్పడంతో చాలా బాధేసిందని చెప్పాడు .
బానే చేస్తా కదా ఎందుకు నా సినిమాలు ఆడట్లేదని చాలా కాలం ఆలోచించానని, మరోవైపు చుట్టు పక్కల వారంతా విలన్ అయిపో అనేవాళ్లని, కానీ తాను మాత్రం బాగా చేస్తే హీరో అవకుండా విలన్ గా చేయమంటారేంటని అనుకునే వాడినని, గాడ్ ఫాదర్ లో నటించడం వెనుక కారణం కూడా ఆ సినిమా చేస్తే ఎక్కువ మంది డైరెక్టర్ల కంట్లో పడి మరిన్ని అవకాశాలొస్తాయని కన్విన్స్ చేయడమేనని చెప్పాడు సత్యదేవ్.







