US Shut Down: సుదీర్ఘ షట్ డౌన్ తెరదించేందుకు ప్రయత్నాలు…!
40రోజులుగా కొనసాగుతున్న అమెరికా ప్రభుత్వ షట్ డౌన్ ముగింపునకు వచ్చింది. దీనికి అనుకూలంగా ఆ దేశ సెనెట్ ఓటింగ్ జరిగింది. కొందరు డెమోక్రాట్లు కూడా అనుకూలంగా ఓటు వేయడంతో 40 రోజుల పాటు నిలిచిపోయిన ప్రభుత్వ కార్యకలాపాలు తిరిగి ప్రారంభం కానున్నాయి (US government shut down).
దేశవ్యాప్తంగా విమాన సేవలకు అంతరాయం కలగడంతో ఈ ప్రతిష్టంభనను తొలగించడానికి సెనెటర్లు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా షట్‌డౌన్ ముగించే దిశగా తొలిఅడుగు పడింది. ట్రంప్, రిపబ్లికన్లు ప్రతిపాదించిన ఓ డీల్‌కు కొందరు డెమోక్రాట్లు సానుకూలంగా స్పందించారు. చివరి నిమిషంలో టెక్సాస్ సెనెటర్ జాన్ కార్నిన్ ఓటుతో తీర్మానానికి అనుకూలంగా 60 ఓట్లు వచ్చాయి. సెనెట్‌లో రిపబ్లికన్ సభ్యుల సంఖ్య 53 కాగా.. డెమోక్రాట్ల సంఖ్య 45, ఇద్దరు స్వతంత్రులు ఉన్నారు. అక్కడ బిల్లు ఆమోదం పొందాలంటే 60 ఓట్లు రావాలి. ఇప్పుడు కనీసం ఎనిమిది మంది డెమోక్రాట్లు మద్దతు ఇచ్చారు.
అమెరికాలో ప్రభుత్వ షట్ డౌన్ ఎఫెక్ట్.. ఆర్థికవ్యవస్థపై తీవ్రంగానే ఉంది. మరీ ముఖ్యంగా దేశవ్యాప్తంగా విమాన సేవలకు అంతరాయం కలుగుతోంది. ప్రభుత్వ షట్‌డౌన్ కారణంగా శనివారం అగ్రరాజ్యంలో 1,400కిపైగా విమానాలు రద్దయ్యాయి. 6,000కు పైగా విమానాలు ఆలస్యమయ్యాయి. 40 విమానాశ్రయాల్లో ఎయిర్ ట్రాఫిక్‌ను 4 శాతం మేరకు తగ్గించాలని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్ఏఏ) నిర్ణయించింది. షట్‌డౌన్ కారణంగా గత నెల రోజులుగా విమానాశ్రయాల్లో పనిచేసే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లకు వేతనాలు అందడంలేదు. దీంతో చాలామంది విధులకు హాజరుకావడం లేదు.
అమెరికాలో షట్‌డౌన్ మొదలైతే ఎంతకాలం కొనసాగుతుందో చెప్పలేం. 1981 నుంచి అక్కడి ప్రభుత్వం 15 సార్లు మూతపడింది. 2018-19 మధ్య దాదాపు 35 రోజులపాటు మూతపడగా.. అప్పటికి అదే సుదీర్ఘ షట్‌డౌన్. ట్రంప్ (Donald Trump) హయాంలో ప్రభుత్వ సేవలు నిలిచిపోవడం ఇది మూడోసారి. ఇప్పుడు తాజా షట్డౌన్కు తెరపడే దిశగా అడుగులు పడ్డాయి.







