వినోదాత్మక చిత్రానికి ఓటేసిన రామ్
ఎనర్జిటిక్ స్టార్ రామ్ ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో డబుల్ ఇస్మార్ట్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా తెరకెక్కుతుండటంతో దీనిపై మంచి అంచనాలున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా బ్యాలెన్స్ షూటింగ్ కోసం రామ్ ముంబై లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత ఎనర్జిటిక్ స్టార్ ఎవరితో సినిమా చేయనున్నాడనే దానిపై ఇప్పుడు సస్పెన్స్ నెలకొంది.
నెట్ఫ్లిక్స్ నిర్మించిబోయే భారీ వెబ్ సిరీస్ కోసం రామ్ ను పలువురు దర్శకులు కలిసి స్టోరీ డిస్కషన్స్ చేసినప్పటికీ అవేమీ ఫలించలేదని తెలుస్తోంది. హరీష్ శంకర్ తో సినిమా అన్నారు కానీ అది జరగడానికి కొంత టైమ్ పట్టేట్లుంది. ఈ లోపు మరో క్రేజీ ప్రాజెక్ట్ ను రామ్ లాక్ చేసినట్లు తెలుస్తోంది. గతేడాది మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో సూపర్ హిట్ ను అందుకున్న డైరెక్టర్ మహేష్ బాబు చెప్పిన కథకు రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ సినిమాను టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్నట్లు సమాచారం. మాస్ ట్రాక్ లో వెళ్తున్న రామ్ ఈ సినిమాలో లవర్ బాయ్ తరహా రొమాంటిక్ లుక్ లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కూడా మిస్ట శెట్టి మిస్టర్ పోలిశెట్టి లాగా వినోదాత్మక చిత్రంగానే రూపొందనుందని, ఆ కోణం నచ్చే రామ్ ఈ సినిమాను ఒప్పుకున్నాడని సన్నిహిత వర్గాల సమాచారం.













