Raj Nidimoru: సిటాడెల్ కోసం సమంతను అందుకే తీసుకున్నా

హీరోయిన్ గా ఆల్రెడీ సత్తా చాటి రీసెంట్ గానే శుభం(Subham) సినిమాతో నిర్మాతగా మారిన సమంత(Samantha) మొదటి ప్రయత్నంతోనే నిర్మాతగా సక్సెస్ అయింది. అయితే సమంత కొన్నాళ్లుగా డైరెక్టర్ రాజ్ నిడిమోరు(Raj Nidimoru)తో ప్రేమలో ఉందనే వార్తలు సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్నాయి. వీరిద్దరూ కలిసి ఫ్యామిలీ మ్యాన్2(Family Man2), సిటాడెల్(Citadel) కోసం వర్క్ చేశారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రాజ్-డీకే(DK) మాట్లాడుతూ సిటాడెల్ సిరీస్ కోసం సమంతను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారో తెలిపారు. సమంతకు యాక్షన్ సీన్స్ చేసే సామర్థ్యం చాలా ఎక్కువగా ఉందని, దాని వల్లే ఆమెను సిటాడెల్ కోసం సెలెక్ట్ చేశామని రాజ్ వెల్లడించాడు. హనీ క్యారెక్టర్ కోసం టాలెంటెడ్ యాక్టర్ కావాలనుకున్నామని చెప్పాడు.
సమంతను సెలెక్ట్ చేసుకుని ఆమెను యాక్షన్ స్టార్ గా చేసి, ఆ క్యారెక్టర్ ను సమంతే చేయగలదని ఎంతో నమ్మామని, ఇంకా చెప్పాలంటే సమంతను దృష్టిలో ఉంచుకునే ఆ క్యారెక్టర్ ను రాసుకున్నామని, అదే టైమ్ లో సమంత మయోసైటిస్ తో బాధ పడుతుండగా, హెల్త్ ఇష్యూస్ వల్ల తనను హోల్డ్ లో పెట్టడం కరెక్ట్ కాదని, ఆమెను సపోర్ట్ చేసి తనకు మొత్తం సెట్ అయ్యాకే షూటింగ్ కు వెళ్లామని రాజ్ అన్నాడు.