ప్రధాని మోడీపై ప్రీతి ప్రశంసలు
ప్రజలనే ప్రభువులుగా పేర్కొంటూ ప్రధాని నరేంద్రమోడీ వివిఐపి సంస్కృతికి చెక్ చెప్పడంపై ప్రముఖ బాలీవుడ్ నటీమణి ప్రీతిజింతా ప్రశంసలు కురిపించారు. ఆమె ట్విట్టర్లో ప్రధాని మోడీ తీసుకుంటున్న అనేకచర్యలు అద్భుత ఫలితాలందిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. దేశం ఒక్కటే అభివృద్ధి చెందితేచాలదని, దేశంలోని ప్రతి పౌరుడూ అభివృద్ధి చెందాలన్న ప్రధాని ఆలోచనలు అభినందనీయంగా ఉన్నాయని వ్యాఖ్యానించారమే. సైనిక కుటుంబంలో పుట్టిన నాకు ప్రధాని ప్రతిచోటా ఈ దేశ సైనికుల ప్రతాపాలను, దేశభక్తి గురించి మాట్లాడటం అద్భుతమనిపిస్తుంది. ప్రతి మాట తూటాల్లా పేలుతుందని వ్యాఖ్యానించారు. ప్రధాని ప్రకటించిన పథకాలలో ముఖ్యంగా దేశాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు చేసిన స్వచ్ఛభారత్ కార్యక్రమంతోపాటు మహిళల భద్రత, విద్యకోసం, బాలికలను సమాజంలో రక్షించుకోవాలన్న అవసరాన్ని తెలియజేసేలా రూపొందించిన భేటీ బచావో-బేటీ పడావో కార్యక్రమాలు చాలా ఇష్టపడతానని చెప్పుకొచ్చిందామే.













