గ్రేట్ హ్యుమానిటీ చాటుకున్ననటి ప్రణీత
సినీకార్మికుల్ని ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి గారి ఆధ్వర్యంలో ఏర్పడిన కరోనా క్రైసెస్ చారిటీ మనకోసం టాలీవుడ్ సెలబ్రిటీస్ చేసిన సహాయం ఎప్పటికి మర్చిపోలేనిది. కోట్లు తీసుకునే హీరోయిన్స్ మాత్రం ఒకరిద్దరు హీరోయిన్స్ తప్పిస్తే ఇదంతా మాకు సంభందం లేదన్నట్లు మౌనంగా ఉండిపోయారు. ఇందుకు మినహాయింపు గా ప్రణీత తన ఉదారతను చాటుకుంది. బాపుగారి బొమ్మ అనే పాట ప్రణీత కోసం రాశారో గానీ అప్పటి నుంచి ఆ పేరే ఫిక్స్ ఆమెకు ఇంత వరకు అందంలోనే ప్రణీత మిన్న అనుకున్నారు. కానీ సాయం చేయడంలో పది మంది కోసం నిలబడటంతో అందంతో పాటు మంచి మనసుందని తెలుగువారికి తెలిసింది. ఎంతో మంది స్టార్ హీరోయిన్ల కన్నా.. ప్రతీణ వంద రెట్లు మేలని నెటిజన్లు కొనియాడుతున్నారు. కరోనా లాంటి విపత్కర కాలంలో ఎంతో మంది ఆకలిని తీరుస్తోంది. చేసింది తక్కువ సినిమాలైనా తక్కువ రెన్యూమరేషన్ అయినా ఈ మాత్రం సహాయం చేసిందంటే మొదటగా ఓ 50 కుటుంబాలకు సాయం చేసేందుకు గానూ లక్ష రూపాయలను విరాళంగా ప్రకటించింది ప్రణీత. నేనే కాదు మీరందరు (హీరోయిన్స్‌ని) కూడా సాయం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చింది. ఆపై తానే స్వయంగా దగ్గరుండి పేదలు, వలసకార్మికులందరికీ ఆకలిని తీర్చుతోంది.
ప్రణీత చేసే సేవా కార్యక్రమాలను సోషల్ మీడియా మొత్తం హ్యాట్యాఫ్ చెప్పేస్తోంది. బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపింది. రెండు చిత్రాల్లో నటిస్తున్నానని పేర్కొంది. అక్కడ కూడా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నానని తెలిపింది. అజయ్ దేవగణ్ భుజ్, హంగామా 2 చిత్రంలో నటిస్తున్నానని వెల్లడించింది. తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు పబ్లిసిటీ చేసుకోవడం నచ్చదని తెలిపింది. తాను ఏ పని చేసినా సీక్రెట్‌గా ఉంచుతానని పేర్కొంది. డాక్టర్లైన మా తల్లిదండ్రుల కారణంగా సమాజ సేవపై ఆసక్తి ఏర్పడిందని చెప్పుకొచ్చింది. ఇప్పటికే రెండు స్కూళ్లను దత్తత తీసుకున్నానని తెలిపింది. కరోనా కోసం ప్రణీత ఫౌండేషన్.ఓఆర్‌జి ద్వారా మరో 8 లక్షల ఫండ్‌ను కలెక్ట్ చేశానని పేర్కొంది. ఆ ఫండ్ ని ఈ కాస్త కాలం లో పేద వారికీ ఉపయోగపడేలా సహాయం అందిస్తానని చెప్పింది.
అత్తారింటికి దారేది లాంటి పెద్ద హిట్ తరువాత తెలుగులో అంతగా నటించకపోవడానికి గల కారణాలను చెబుతూ.. ఆ సినిమా తరువాత కన్నడ, తమిళంలో బాగా అవకాశాలు వచ్చాయి.. తెలుగులో చెప్పుకోదగ్గ పాత్రలు రాకపోడంతో ఎక్కువగా చేయలేకపోయానని తెలిపింది. పవన్ కళ్యాణ్ గురించి చెబుతూ… ఆయనలోని సెన్సాఫ్ హ్యూమర్ ఎంతో ఇష్టమని తెలిపింది. ఎన్టీఆర్ గురించి చెబుతూ.. ఆయన డైలాగ్ చెప్పే విధానం ఇష్టమని చెప్పుకొచ్చింది. ఆయన డైలాగ్ లైన్స్ చెబుతూ ఉంటే షాక్ అయ్యేదాన్ని.. ఆయనో అరుదైన నటుడని కొనియాడింది.






