రవితేజకు జోడీ ప్రగ్వాజైస్వాల్
అందం అభినయం కలగలిసిన కథానాయికగా ప్రగ్వా జైస్వాల్ కనిపిస్తుంది. కంచె సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన ఈ అమ్మాయి, గుంటూరోడు సినిమాలోను అలరించింది. త్వరలో నక్షత్రం సినిమాతో ప్రేక్షకులను పలకరించుంది. తాజాగా ఆమె స్టార్ హీరో సరనన ఛాన్స్ కొట్టేసింది. రవితేజ కథానాయకుడిగా దర్శకుడు విక్రమ్ సిరి ‘టచ్ చేసి చూడు’ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో ఒక కథానాయికగా రాశిఖన్నా నటిస్తోంది. తాజాగా మరో కథానాయికగా ప్రగ్వా జైస్వాల్ ను తీసుకున్నారు. రవితేజ సరసన కథానాయికగా ఛాన్స్ రావడం పట్ల ఆమె ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఈ సినిమా తన కెరియర్ కి బాగా హెల్ఫ్ అవుతుందని భావిస్తోంది. ఆమె నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి మరి.













