Kingdom: ఆడియన్స్ ను నిరాశ పరిచిన కింగ్డమ్
గత కొన్ని సినిమాలుగా వరుస ఫ్లాపులు ఎదుర్కొంటున్న టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) ప్రధాన పాత్రలో వచ్చిన తాజా సినిమా కింగ్డమ్(kingdom). జెర్సీ(jersey) ఫేమ్ గౌతమ్ తిన్ననూరి(gowtham thinnanuri) దర్శకత్వంలో భాగ్య శ్రీ బోర్సే(bhagya sri borse) హీరోయిన్ గా నటించిన ఈ సినిమా జులై 31న ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుని దూసుకెళ్తుంది.
అయితే కింగ్డమ్ సినిమా చూసిన అందరికీ ఓ విషయంలో మాత్రం తీవ్ర నిరాశ ఎదురైంది. అదే హృదయం లోపల(Hridayam Lopala) సాంగ్. కింగ్డమ్ సినిమాలో చార్ట్‌బస్టర్ గా నిలిచిన ఈ సాంగ్ ను మేకర్స్ ఎడిటింగ్ లో తీసేశారు. కనీసం ఈ బీజీఎం తో సినిమాలో ఎలాంటి లవ్ సీన్ కూడా లేకపోవడంతో సినిమా చూసిన వారంతా ఈ విషయంలో నిరాశ చెందారు.
హృదయం లోపల సాంగ్ ను థియేటర్ లో ఎంజాయ్ చేద్దామనుకున్న వారికి ఈ విషయంలో తీవ్ర నిరాశే మిగిలింది. ఆడియన్స్ నిరాశను పరిగణనలోకి తీసుకుని కొన్నాళ్ల తర్వాత అయినా ఆ పాటను సినిమాలో యాడ్ చేస్తారేమో చూడాలి. అనిరుధ్ రవిచందర్(anirudh Ravichander) సంగీతం అందించిన ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్(sithara entertainments) సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించిన విషయం తెలిసిందే.







