Mrunal: అరడజను సినిమాలతో మృణాల్ క్రేజీ లైనప్

సీతారామం(Sitaramam) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) ఆ సినిమాతో అందరి మనసుల్లోనూ నిలిచిపోయింది. సీతారామం తర్వాత మృణాల్ కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. ప్రస్తుతం అమ్మడి చేతిలో ఆరు క్రేజీ ప్రాజెక్టులున్నాయి. అందులో రెండు తెలుగు సినిమాలు కాగా మరో నాలుగు హిందీ సినిమాలు. ఈ ఆరు సినిమాల్లో మృణాల్ నుంచి ముందుగా సన్నాఫ్ సర్దార్2(Son of Sardar2) రాబోతుంది.
అజయ్ దేవగణ్(Ajay devgan) హీరోగా నటిస్తున్న ఈ సినిమా సన్నాఫ్ సర్దార్(Son of sardar) కు సీక్వెల్ గా తెరకెక్కింది. సన్నాఫ్ సర్దార్ సినిమా రాజమౌళి(rajamouli) దర్శకత్వంలో వచ్చిన మర్యాద రామన్న(maryada Ramanna)కు రీమేక్ అన్న విషయం తెలిసిందే. తెలుగులో మర్యాద రామన్నకు సీక్వెల్ రాకపోయినా బాలీవుడ్ లో సన్నాఫ్ సర్దార్ కు సీక్వెల్ చేస్తూ అజయ్ దేవగణ్ సాహసం చేస్తుండగా, అందులో మృణాల్ హీరోయిన్ గా నటిస్తోంది.
దీంతో పాటూ మరో మూడు హిందీ సినిమాల్లో కూడా మృణాల్ నటిస్తోంది. హై జవానీతో ఇష్క్ హోనా హై, తుమ్ హోతో, పూజా మేరీ జాన్ లాంటి సినిమాల్లో మృణాల్ నటిస్తోంది. ఇవి కాకుండా తెలుగులో అడివి శేష్ హీరోగా వస్తోన్న డెకాయిట్(dacoit) లో ఫీమేల్ లీడ్ గా నటిస్తున్న మృణాల్, అల్లు అర్జున్(Allu Arjun)- అట్లీ(Atlee) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో ఓ హీరోయిన్ గా నటిస్తోంది. మొత్తానికి మృణాల్ ఇటు తెలుగుతో పాటూ అటు హిందీలో కూడా వరుస సినిమాలను లైన్ లో పెట్టి కెరీర్ ను పరుగులెట్టిస్తోంది.