పాత్రను బట్టి మృణాల్ బిహేవ్ చేస్తుంది
అడివి శేష్(Adivi sesh), మృణాల్ ఠాకూర్(Mrunal thakur) జంటగా నటించిన డెకాయిట్(Dacoit) సినిమా రిలీజవుతున్న వేళ, ఈ సినిమాపై ఆసక్తి బాగా ఎక్కువగా ఉంది. షానియెల్ డియో(Shaniel deo) దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు సుప్రియ యార్లగడ్డ(Supriya Yarlagadda) నిర్మించారు. రిలీజ్‌కు ముందే కంటెంట్ ఆధారిత సినిమాగా చర్చనీయాంశమైన ఈ మూవీ, ప్రమోషన్స్‌తో మరింత హైప్ తెచ్చుకుంటోంది. ముఖ్యంగా శేష్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇవి కూడా చదవండి
సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా శేష్, మృణాల్ ఠాకూర్ పనితీరుపై ఆసక్తికర విషయాలను వెల్లడించారు. సెట్స్‌లో ఆమె ప్రవర్తన ఇతర నటీమణులతో పోలిస్తే పూర్తిగా భిన్నంగా ఉంటుందని తెలిపారు. సాధారణంగా షూటింగ్ సమయంలో నటీనటులు సీన్స్ మధ్య సరదాగా గడిపినా, మృణాల్ మాత్రం తన పాత్రలో పూర్తిగా లీనమై ఉండటాన్ని ఆయన ప్రస్తావించారు. ఏ సీన్ షూట్ చేయాలో ముందుగానే తెలుసుకుని, దానికి తగ్గ మూడ్‌లోకి వెళ్లి రోజంతా అదే భావంలో కొనసాగుతుందని చెప్పారు.
మొదట్లో ఆమె ఈ విధానం ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ, కొన్ని రోజుల తర్వాత ఆమె నటనలోని డెడికేషన్ అర్థమైందని శేష్ తెలిపారు. ముఖ్యంగా ఎమోషనల్ లేదా రొమాంటిక్ సన్నివేశాల కోసం ముందుగానే మానసికంగా సిద్ధమవడం, ఆ పాత్రలో పూర్తిగా మునిగిపోవడం ఆమె ప్రత్యేకతగా ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో మృణాల్ ఠాకూర్ మెథడ్ యాక్టింగ్‌కు దగ్గరగా ఉండే శైలిని అనుసరిస్తున్నట్టు స్పష్టమవుతోంది.
ఇవి కూడా చదవండి






