Manchu Manoj: మరిన్ని ఛాలెంజింగ్ రోల్స్ కు రెడీ అయిన మనోజ్

టాలీవుడ్ నటుడు మంచు మనోజ్(manchu manoj) కు మొన్నటివరకు ఏం చేసినా కలిసిరాలేదు. కానీ రీసెంట్ గా రిలీజైన మిరాయ్(mirai) మనోజ్ లైఫ్ ను ఒక్కసారిగా మార్చేసింది. తేజ సజ్జా(teja sajja) ప్రధాన పాత్రలో కార్తీక్ ఘట్టమనేని(karthik ghattamaneni) దర్శకత్వంలో తెరకెక్కిన మిరాయ్ సెప్టెంబర్ 12న రిలీజ్ అవగా ఆ సినిమాను ఫస్ట్ షో నుంచే ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
మిరాయ్ సినిమాలో మనోజ్ బ్లాక్ స్వార్డ్(black sword) అనే కీలక పాత్రలో నటించి అందరినీ తన యాక్టింగ్ తో మెప్పించి, ప్రశంసలు అందుకుంటున్నాడు. అయితే ఇప్పుడు మిరాయ్ ఇచ్చిన సక్సెస్ ను మనోజ్ చాలా జాగ్రత్తగా వాడుకోవాలని చూస్తున్నాడు. అందులో భాగంగానే మనోజ్ గతంలో మొదలుపెట్టిన రెండు మూడు సినిమాలను మళ్లీ మొదలుపెడుతున్నట్టు తెలుస్తోంది.
ఆల్రెడీ మొదలుపెట్టిన సినిమాలతో పాటూ కొత్త సినిమాలను కూడా ఒప్పుకోవాలని చూస్తున్న మనోజ్ తన రెమ్యూనరేషన్ ను కూడా పెంచినట్టు సమాచారం. అయితే సక్సెస్ దక్కడంతో మనోజ్ అడిగినంత ఇవ్వడానికి నిర్మాతలు కూడా రెడీగా ఉన్నారని తెలుస్తోంది. చూస్తుంటే రానున్న రోజుల్లో మనోజ్ కేవలం హీరోగానే కాకుండా మరిన్ని ఛాలెంజింగ్ రోల్స్ లో నటిస్తూ బిజీగా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.