Drithi Rajkumar: తండ్రి కోరిక నెరవేర్చిన ధృతి రాజ్‌కుమార్
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్(Puneeth Raj Kumar) కూతురు ధృతి రాజ్‌కుమార్(Drithi Rajkumar) తన తండ్రి ఆశను, కోరికను సొంతం చేసింది. పిల్లలు బాగా చదువుకుని చదువులో రాణించాలని పునీత్ ఎప్పుడూ కోరుకునే వారు. ఆయన లేకపోయినా ఆయన తండ్రి కోరికను ధృతి నెరవేర్చింది. తండ్రి అడుగు జాడల్లో నడుస్తూ టాప్ మార్కులతో ధృతి అమెరికాలోని ఓ యూనివర్సీటీ నుంచి పట్టభద్రురాలైంది.
పట్టా అందుకున్న తర్వాత ధృతి అక్కడే ఉన్న తన తల్లిని కౌగిలించుకుని ఆ వీడియోలను, ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేయగా, ఆ పోస్ట్ ను చూసి ఈ టైమ్ లో నాన్న ఉంటే ఎంతో సంతోషించేవాడని పునీత్ రాజ్‌కుమార్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 2021లో డిగ్రీ పూర్తి చేయడానికి అమెరికా వెళ్లింది ధృతి రాజ్‌కుమార్.
పార్సన్స్ స్కూల్ ఆఫ్ డిజైన్ నుంచి ధృతి తాజాగా గ్రాడ్యుయేషన్ ను పూర్తి చేయగా ఈ కార్యక్రమంలో ధృతి తల్లి అశ్వినీ పునీత్ రాజ్‌కుమార్(Aswini Puneeth Rajkumar), వినయ్ రాజ్‌కుమార్(Vinay Rajkumar), వందిత పునీత్ రాజ్‌కుమార్(Vanditha Puneeth Rajkumar) పాల్గొన్నారు. ప్రస్తుతం దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 2002లో అప్పు(Appu) అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన పునీత్ రాజ్‌కుమార్ 2021లో జిమ్ లో వర్కవుట్స్ చేస్తున్న టైమ్ లో అకస్మాత్తుగా హార్ట్ ఎటాక్ వచ్చి చనిపోయిన విషయం తెలిసిందే.
https://www.instagram.com/p/DJvihJWNj_p/?utm_source=ig_web_copy_link






