Vivekananda : ఎవరి ప్రయోజనం కోసం కవిత ఇలా వ్యవహరిస్తున్నారు? కేపీ వివేకానంద
కాంగ్రెస్కు మేలు చేసేలా జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కవిత (Kavitha) వ్యాఖ్యలున్నాయని బీఆర్ఎస్ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద (KP Vivekananda) విమర్శించారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియాలో సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ ట్రాప్లో పడి కవిత బీఆర్ఎస్ (BRS) పై విమర్శలు చేయడమేమిటని ప్రశ్నించారు. ఎవరి ప్రయోజనం కోసం ఇలా వ్యవహరిస్తున్నారు? కేసీఆర్ కుమార్తెగా కవితను గౌరవిస్తున్నాం. ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాలి. ఏదైనా మాట్లాడుతామంటే రియాక్షన్ కూడా అదే రీతిలో ఉంటుందన్న విషయాన్ని గుర్తెరగాలి. పదేళ్ల అధికారం అనుభవించినప్పుడు లేని తప్పులు కవితకు ఇప్పుడెలా గుర్తుకు వస్తున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో ఎలాంటి సంబంధం లేదని చెప్పి, ఫలితాలు విడుదలైన తర్వాత బీఆర్ఎస్ నేతలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం సరికాదు. అనేక అక్రమాలు, దౌర్జన్యాలకు పాల్పడి కాంగ్రెస్ గెలిచిన విషయం తెలియదా? తాను చేసిన వ్యాఖ్యలపై ఆమె ఆత్మవిమర్శ చేసుకోవాలి అని పేర్కొన్నారు.






