Bandi Sanjay: ఈ ఫలితం హిందువులకు గుణపాఠం : బండి సంజయ్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం తర్వాత హిందువుల్లో కసి పెరిగిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు. హైదరాబాద్లో జరిగిన ఓ కార్యక్రమంలో బండి సంజయ్ మాట్లాడారు. ఈ ఫలితం హిందువులకు గుణపాఠం అయిందని తెలిపారు. హిందువులంతా ఓటు బ్యాంకుగా మారాల్సిందేనని కోరారు. ఏపీ(AP), తెలంగాణ (Telangana) లో ఇతర మతాల్లో చేరిన హిందువులంతా ఘర్ వాపసీ రావాలని పిలుపునిచ్చారు. వారి కోసం హిందూ ధర్మ రక్షణ ద్వారాలు తెరిచే ఉన్నాయని స్పష్టం చేశారు. మతాలను మార్చుకుంటే దేవుళ్లను మోసం చేసినట్టేనని అన్నారు. అన్ని కులాలు తమ సామాజిక వర్గ సంక్షేమానికి పాటు పడుతూనే హిందూ ధర్మం కోసం పని చేయాలని సూచించారు. రాజకీయాలు, పదవులు, ప్రజల కోసం కుల సంఘాలు వేర్వేరుగా ఉన్నా, దేశం కోసం, ధర్మం కోసం ఒక్కటి కావాలని కోరారు. పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సనాతన ధర్మ ప్రచారం వల్ల ఇతర మతాల్లో చేరిన హిందువుల్లో పునరాలోచన వస్తోందని సంజయ్ తెలిపారు.






