Revanth Reddy:తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికి అవి ఒక గర్వకారణం: సీఎం రేవంత్‌రెడ్డి
రామోజీ అనేది ఒక పేరు కాదు, ఒక బ్రాండ్ ఈ బ్రాండ్‌ను కొనసాగించాల్సిందిగా కోరుతున్నాం అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) అన్నారు. రామోజీ ఎక్స్లెన్స అవార్డుల (Ramoji Excellence Award) ప్రదానోత్సవంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రామోజీరావు ఏ విలువలను, ఏ సంప్రదాయాలను తెలుగు ప్రజకు అందించారో, ఆ మేరకు రాణించిన వారిని గుర్తించాలన్నారు. పురస్కారాలు ప్రదానం చేసి కొత్త తరానికి స్ఫూర్తినివ్వాలని తలపోసిన రామోజీ గ్రూప్ సంస్థల సీఎండీ కిరణ్ (CMD Kiran)ను, కుటుంబ సభ్యులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. రామోజీ స్ఫూర్తిని కొనసాగిస్తూ కుటుంబ సభ్యులు ఈరోజు ఈ సంస్థలన్నింటినీ సమర్థంగా నిర్వహిస్తుండడంతో, తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ (Hyderabad) నగరానికి అవి ఒక గర్వకారణంగా నిలబడ్డాయి. రామోజీ ఫిల్మ్ సిటీ (Ramoji Film City), ఈటీవీ, ఈనాడు, తెలంగాణకు, హైదరాబాద్ నగరానికి ఒక గొప్ప గౌరవం. ఈ గౌరవాన్ని ముందుకు తీసుకెళ్లడానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున సంపూర్ణ సహకారం ఉంటుంది అన్నారు.






