Kingdom2: కింగ్డమ్2 ఎప్పుడుంటుందంటే?
టాలీవుడ్ లో సీక్వెల్స్ ట్రెండ్ బాగా పెరిగిపోయింది. అందుకే కథతో సంబంధం లేకుండా సినిమాలకు సీక్వెల్స్ ను అనౌన్స్ చేస్తున్నారు. ఇప్పుడు విజయ్ దేవరకొండ(vijay devarakonda) హీరోగా గౌతమ్ తిన్ననూరి(Gowtham Thinnanuri) దర్శకత్వంలో రీసెంట్ గా వచ్చిన కింగ్డమ్(kingdom) సినిమాకు కూడా సీక్వెల్ ఉందని అఫీషియల్ గా తేలిపోయింది. అయితే ఈ సీక్వెల్ గురించి నిర్మాత నాగవంశీ(naga vamsi) తాజాగా మాట్లాడాడు.
విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఒప్పుకున్న సినిమాలన్నీ పూర్తయ్యాక కింగ్డమ్2ను సెట్స్ పైకి తీసుకెళ్తామని, కింగ్డమ్ క్లైమాక్స్ లో చూపించిన సేతు క్యారెక్టర్ ను ఓ స్టార్ హీరో చేస్తారని, అది చూసి అందరూ కచ్ఛితంగా సర్ప్రైజ్ ఫీలవుతారని, ఫస్ట్ పార్ట్ లో భాగ్య శ్రీ(bhagyasri borse) క్యారెక్టర్ ను కేవలం పరిచయం మాత్రమే చేశామని, రెండో పార్ట్ లో ఆమె పాత్రకు ప్రాధాన్యత ఎక్కువ ఉంటుందని చెప్పాడు వంశీ.
సెకండ్ పార్ట్ లోనే హీరో, హీరోయిన్ మధ్య అసలైన వార్ మొదలవుతుందని ఫస్ట్ పార్ట్ ను మించి కింగ్డమ్ సీక్వెల్ ఉంటుందని నాగవంశీ చెప్పాడు. అయితే విజయ్ ప్రస్తుతం చేతిలో రవికిరణ్ కోలా(ravi kiran kola)తో ఓ సినిమా, రాహుల్ సాంకృత్యన్(rahul sankrithyan0 తో ఓ పీరియాడిక్ సినిమా ఉన్న సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలూ పూర్తైన తర్వాతే కింగ్డమ్2(kingdom2) ఉంటుంది. అవి పూర్తవడానికి ఎంతలేదన్నా ఏడాదిన్నరకు పైగా పడుతుంది.







